Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరం

జై భారత్ వాయిస్ దామెర
సమాజంలోని ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, తద్వారా ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. సోమవారం దామెర మండలం ల్యాదెల గ్రామంలో పెద్దమ్మతల్లి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రావణ్యఅనిల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ కాగితాల శంకర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెద్దమ్మతల్లి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ క్రతువును ఎంపీపీ శంకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని, తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. దైవారాధనతో పలు సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్య అనిల్, ల్యాదెల్ల గ్రామానికి చెందిన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి, ఉప సర్పంచ్ మాదాసు కీర్తివెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్లు పెసరు మహిపాలరెడ్డి, మాదాసు వెంకటేశ్వర్లు, పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఇండ్ల రాజు, పిట్టల రమేష్. అన్నెబోయిన రోహిత్, కొలిపాక రాజు, పెండెం రాజు. కుల పెద్దలు కొలిపాక రవి, పెండెం కొమురయ్య, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి

సిడిఎంఏ వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ లో పర్యటన

ఆత్మకూరు తాపీ మేస్త్రిల సంఘం అధ్యక్షులు గా మంద రవి