Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

జై భారత్ వాయిస్ దామెర
ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని, పోషణ మాసంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. జాతీయ పోషణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శంకర్ మాట్లాడుతూ పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పలు కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గరిగె కల్పనకృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్, తహశీల్దార్ ఎం.జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓ రవీందర్, గిర్దావర్ ఎల్.భాస్కర్రెడ్డి, దామెర సర్పంచ్ గురిజాల శ్రీరాంరెడ్డి, ఈజీఎస్ ఏపీవో శారద, ఐకేపీ ఏపీఎం ఝాన్సీ, విద్యుత్ ఏఈ రమేష్, దళితబందు చైర్మన్ గరిగె కృష్ణమూర్తి, ఐసీడీఎస్ ఊరుగొండ, దామెర సెక్టార్ల సూపర్వైజర్లు పద్మావతి, రాణి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం

Chaitanya digree college technovista చైతన్య డిగ్రీ కాలేజీలో టెక్నో విస్టా

బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది-మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్