April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రంగాపురం లో ఘనంగా గురు పుజోత్సవం

రంగాపురంలో ఘనంగా గురుపూజోత్సవం
(జై భారత్ వాయిస్ నల్లబెల్లి)
నల్లబెల్లి మండలం రంగాపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది .గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావును గ్రామ సర్పంచ్ చీకటి ప్రకాష్ తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థుల తో అభివృద్ధి చేసినందుకు తనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిందని అన్నారు .ఈ అవార్డు పాఠశాల తోటి ఉపాధ్యాయుల సహకారం వల్లనే వచ్చిందని వారికి అంకితం అని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చీకటి ప్రకాష్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు .ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను గ్రామ సర్పంచ్ చీకటి ప్రకాష్ ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తూముల రఘువీరు ,సూర దామోదర్ ,శ్రీనివాసు, మహేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి రవూఫ్ ,శోభన్ బాబు ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని అశోక్, ఉపాధ్యాయులు ఇజ్జిగిరి పెద్దన్న తోపాటు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

ఎస్ఎఫ్ఐ పరకాల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా

ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ