Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

(జై భారత్ వాయిస్ గీసుగొండ )
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని  పురస్కరించుకొని
గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్ డిగ్రీ కాలేజీ లో ఉపాధ్యాయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాధాకృష్ణన్ చిత్ర పటానికి కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం కో ఆర్డినేటర్ కొక్కొండ శ్రీకాంత్ పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం   శ్రీకాంత్ మాట్లాడుతు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణన్ అని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ప్రణయ్, మౌనిక, రాణి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు

మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము

రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి