Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సమగ్ర శిక్ష ఉద్యోగుల ను క్రమభద్దికరించాలి

సమగ్ర శిక్ష ఉద్యోగులు వేతనాలు పెంచాలి
– హన్మకొండ నగరం లో పోచమ్మ బోనాలతో వినూత్న ప్రదర్శన
(జై భారత్ వాయిస్ హన్మకొండ);
ఎమ్మర్సిలలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ లో బుధ వారం సమగ్ర శిక్ష ఉద్యోగులు పోచమ్మ బోనాలతో వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మేము ద మేము 15 నుండి 12 సంవత్సరాలు గా పని పేరుతో..వెట్టి చాకిరీ చేస్తూ ఒక రెగ్యులర్ అటెండర్ తీసుకునే వేతనం కంటే తక్కువ వేతనం తీసుకుంటున్నామనీ అవేదన వ్యక్తం చేశారు. యూనియన్ లు సహకారం అందించాలనీ కోరారు . సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు ఈ సంధర్భంగా తమకు సహకరించాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయ సంఘానికి కూడా మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మీరు మాకు ,మా పోరాటానికి మద్దతు ఇచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలని అవేదన వ్యక్తం చేశారు మాకు ప్రతి నెల వస్తున్న వేతనంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కుటుంబానికి ఈ డబ్బులు సరిపోతాయనీ ఆందోళన వ్యక్తం చేశారు. మేము పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నాం అంటే ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు, కేవలం ఇది మా హక్కుల సాధన కోసం మా ప్రయత్నం మాత్రమే నని చెప్పారు. దయచేసి ఎవరూ మాపై ఒత్తిడి చేయవద్దని మా కాంట్రాక్ట్ ఉద్యోగుల విన్నపం అని వివారించారు.కాబట్టి మీరందరు మాకు సహాయం చేస్తూ.. మీ బిడ్డల లాగా భావించి మా కష్టాలలో మీరు అండగా నిలిచి మీ మద్దతు ఇచ్చి మా కుటుంబాల్లో వెలుగు నింపేలా కృషి చేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వము వెంటనే స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులను క్రమ బద్దికరించాలని కోరారు. బోనాల తో ర్యాలీ నిర్వహించారు.

Related posts

108 అంబులెన్స్ పైలెట్ పాముల రాజుకు ఉత్తమ అవార్డు

పెంచికలపేట లో ఘనంగా బీరన్న బోనాల పండుగ

Sambasivarao

ఎమ్మేల్యే సమక్షం లో బి అర్ ఎస్ లో చేరిక

Jaibharath News