Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ

జై భారత్ వాయిస్ దామెర

దామెర మండలం ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పురస్కరించుకుని పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు తలపై బోనం ఎత్తుకుని వరుస క్రమంలో పోచమ్మ దేవాలయం చేరుకున్నారు. ఆ తరువాత దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు పోచమ్మ తల్లికి కొబ్బరి కాయలు కొట్టి, పసుపు, కుంకుమలు సమర్పించారు. తమ ఆచార, సంప్రదాయ పద్ధతిలో అమ్మ వారికి నైవేధ్యం, పడులు పెట్టి తమను చల్లగా చూడాలని మొక్కులు సమర్పించారు. అనంతరం పోచమ్మ తల్లి అమ్మ వారికి గొర్రె పోతులను, కోళ్లను బలి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీల ఫోరం చైర్మన్ నేరెళ్ల కమలాకర్, మాజీ ఎంపీటీసీ బండారి వీరస్వామి. వార్డు సభ్యులు తోట శ్రీనివాస్, బీఅర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలువేరు రాజు, బాగాది కుమార్, చిల వేరు రాజు. తోట అకిల్, పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు

Related posts

హాస్టల్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బొచ్చు కళ్యాణ్

Sambasivarao

సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

prajavani ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య