Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కేయూ దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ

జై భారత్ వాయిస్ హన్మకొండ )
2023-2024 విద్యా సంవత్సరము కోసం కాకతీయ విశ్వావిద్యాలయం దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్. డిగ్రీ కళాశాల కో ఆర్డినేటర్ కొక్కొండ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చేయటానికి ఇంటర్ పాస్ అయి ఉండాలి, పి. జి చేయటానికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఒక సంవత్సరము లో పూర్తి చేసే బిజినెస్ మేనేజమెంట్, రిటైల్ మార్కెటింగ్, ట్యాలీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, గైడెన్స్ & కౌన్సిలింగ్, పర్సనాలిటీ & కమ్యూనికేషన్ స్కిల్స్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ డిప్లొమా కోర్సులు మరియు మూడు నెలలలో పూర్తి చేసే మిమిక్రి, ఒకల్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెనేషన్ మ్యూజిక్, సాఫ్ట్ స్కిల్స్ లాంటి ఒరియంటేషన్ కోర్సులు ఉన్నాయని శ్రీకాంత్ తెలిపారు మరిన్ని వివరాలకు 9963591463 నెంబర్ లో సంప్రదించగలరని కోరారు.

Related posts

చారిత్రక గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి వేడుకలు

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News

కోట్ల రూపాయల భవనాన్ని వరంగల్ శ్రీ శృంగేరి శంకర మఠం అప్పగించిన దాతలు-

ఎ. జ్యోతి