Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

ముమ్మరంగా పంచలింగాల శివాలయం పునరుద్ధరణ పనులు
– దాతలు సహకరిస్తే వేగవంతంగా పూర్తి చేస్తాం
– ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): భారత దేశంలోనే అరుదైన అతి పురాతనమైన పంచలింగాల శివాలయం పునరుద్ధరణ పనులు వేగవంతముగా జరుగుతున్నాయి. గురువారం ఆత్మకూరు మండలంలోని కాకతీయుల కాలంలో నిర్మించిన పంచలింగాల శివాలయం శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో భక్తుల సహకారంతో పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి తెలిపారు. వెయ్యి సంవత్సరాల పూర్వము కాకతీయులు ఓరుగలను పాలించే సమయంలో ఈ దేవాలయంలో నిత్య పూజలను నిర్వహించిన అనంతరమే రాజ పాలన చేసే వారన్నారు. అలాంటి దేవాలయం కాలక్రమేన జీర్ణో దారుణకు చేరుకోవడంతో భక్తులు పునర్ నిర్మాణం చేయాలని సంకల్పం తీసుకొని సరస్వతీ పీఠాధిపతి పవన్ కుమార్ శర్మ ఆశీస్సులతో వరుసగా మూడు సంవత్సరాల మాస శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణము నిర్వహించడంతోపాటు రుద్రాభిషేకం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి చేశారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం పునర్నిర్మాణము కు శివపార్వతుల అనుగ్రహం లభించిందని శ్రీ వేద పండితులు శ్రీ పవన్ కుమార్ శర్మ తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో పునరుద్ధరణ చేయాలని ఆలయ కమిటీ తీర్మానం చేసి పనులు మొదలుపెట్టిన వెంటనే ఎందరో భక్తులు తమ భక్తిశ్రద్ధలతోటి శక్తి వంచన లేకుండా భారీ సంఖ్యలో విరాళాలు ఇవ్వడంతో దాదాపు రెండు కోట్ల పైచిలుకతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి తెలిపారు. కృష్ణాష్టమి పురస్కరించుకొని శివాలయానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు చైర్మన్ ప్రారంభం చేశారు. దాతలు ముందుకు వస్తే కార్తీక మాసంలో పూజలు, ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భయ్యా రామరాజు,ఆలయ కమిటీ డైరెక్టర్లు, భక్తులు పాల్గొన్నారు

Related posts

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

Jaibharath News

ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఆహారం ఎంతో మేలు

Jaibharath News

రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వం