Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సిఎం కేసీఆర్ తోనే తెలంగాణ పదిలం. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  స్పష్టం చేశారు.శనివారం గీసుకొండ మండలంలోని
ధర్మారం గ్రామంలో ఏమ్మేల్యే పర్యటించారు.పలు కాలనీలలో కాలినడకన తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాలనీలలో పారిశుధ్య పనులను పరిశీలించారు.అనంతరం గ్రామంలో .3 కోట్ల 83లక్షలతో  రూపాయలతొ నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు.అదేవిధంగా ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన 590 రైతులకు గాను 50లక్షల రూపాయల విలువైన నష్టపరిహారం చెక్కులు అందచేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ…సీఎం కేసీఆర్‌తోనే  తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని,అమలుకు నోచుకోని హామీలు కేసీఆర్‌ ఇవ్వరని, పేద ప్రజలకు అక్కరకొచ్చే పనులే చేస్తారని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్తు, కుల వృత్తులకు ప్రోత్సాహం, సాగునీరు, సకాలంలో ఎరువులు ఇలా ఏ పథకాన్ని చూసినా కేసీఆర్‌ మానవీయ కోణంలో ఆలోచించి అమలు చేస్తున్నారని తెలిపారు.
కేసీఆర్‌ కన్నా గొప్పగా చేస్తామని మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదని, ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచింది కేసీఆర్‌ అని, కాంగ్రెస్‌ ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రూ.4 వేల పింఛన్‌ ఇచ్చి ఇక్కడ ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ చాలని రైతును మళ్లీ గోసపెట్టే కార్యక్రమానికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై విషం చిమ్మే బీజేపీ నాయకులు.. ముందుగా తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడం లేదో సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీల మోసపు మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పునరుద్ఘాటించారు.
తెలంగాణ సాధించిన నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్‌ కావడం మనం చేసుకున్న అదృష్టమని అన్నారు.సిఎం కేసీఆర్  సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాము.మరొక్కసారి దీవించి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుంకరి మనీషా శివకుమార్,ఆకులపల్లి మనోహర్,గద్దె బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోలి రాజయ్య,మండల రైతుబందు కన్వీనర్ వీరాటి లింగారెడ్డి,సొసైటీ చైర్మన్లు దొంగల రమేష్,రడం శ్రీధర్, మాజీ జెడ్పీ కో ఆప్షన్ కొమ్ముల కిషోర్,నాయకులు గంగుల రమేష్,శ్రీనివాస్ రెడ్డి,పోగుల సంజీవ,మాజీ ఎంపిటిసి పిట్టల రజిత రాజు,మాడిషెట్టి స్వరూప రాజయ్య,గాదె బాబు,నాసం మల్లేశం,బోల్లం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన మందపల్లి పాఠశాల విద్యార్థులు

ప్రశస్త్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం

28న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు సిఎం రేవంత్ రెడ్డి సందర్శన