(జై భారత్ వాయిస్ )వరంగల్ సిటీ, సెప్టెంబర్ 9 : నిజ శ్రావణ మాసం 4వ శనివారం వరంగల్ బట్టల బజారులోని బాలానగర శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ఉదయం కడు వైభవంగా తిరుప్పావడ సేవ (అన్న కూటోత్సవం) నిర్వహించారు. 51 కిలోల పులిహోర నైవేద్యంగా స్వామివారికి సమర్పించి అర్చకులు పూజలు జరిపిన అనంతరం పులిహోర ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. తిరుపతిలో స్వామివారికి ప్రతీ గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుందని, వరంగల్ లో స్వామివారికి గత 4 సంవత్సరాలుగా తిరుప్పావడ సేవ శ్రావణ మాసం చివరి శనివారం నిర్వహిస్తున్నట్లు వంశ పారంపర్య ఛైర్మన్ పరాశరం శ్రీనివాసాచార్యులు తెలిపారు. భక్తులకు ప్రసాద పంపిణీని ఈఓ ఎలపాటి రత్నాకర్ రెడ్డి ప్రారంభించారు. ఆలయ అర్చకులు శ్రీధరాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, వేంకటాచార్యులు తదితరులు పూజాదికాలు, గోత్ర నామార్చనలు నిర్వహించారు. నూక వెంకటేశ్వర్లు – అన్నపూర్ణ దంపతులు, నూక సందీప్ – హిమబిందు దంపతులు దాతలుగా వ్యవహరించారు. సభ్యులు గందె గోవిందరాజులు, దివ్వెల పూర్ణ, సురేష్, విజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
next post