Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి

జై భారత్ వాయిస్ దామెర
సమాజంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రెడ్ల అభివృద్ధి, సంక్షేమం కోసం చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ను  ఏర్పాటు చేయాలని రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి కోరారు. ఆదివారం హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట లో   మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెడ్డి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జై పాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద రెడ్ల సంక్షేమం కోసం రూ.5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో మేనిఫేస్టోలో పొందుపరిచిన విధంగా సత్వరమే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ఈ నెల 12న మంగళవారం ఉదయం 10 గంటలకు దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్ లో  దామెర మండల రెడ్లతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని రెడ్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జిల్లా కమిటీ సీనియర్ నాయకులు వీసం రమణారెడ్డి,  మన్నెం ఇంద్రారెడ్డి, గొంది జగన్ మోహన్ రెడ్డి. తదితరులు ఉన్నారు.

Related posts

Sfi ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

Sambasivarao

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బతుకమ్మ సందడి

అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

REPORTER JYOTHI