గృహలక్ష్మితో పేదలకు ఇళ్లు
వైస్ ఎం పీ పీ సుధా కర్ రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
గృహలక్ష్మి పథకంలో పేదలకు సొంతింటి కల సహకారం చేస్తున్నామని ఆత్మకూరు వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి అన్నారు .గృహలక్ష్మి పథకం కింద మంజూరైన ఇళ్లను శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ హా యాంలో గృహలక్ష్మి పథకం కింద పేద సొంతిల్లు కోసం ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నదని చెప్పారు .మండల కేంద్రంలో పేదలకు గృహలక్ష్మి పథకము వరం లా మారిందని అన్నారు .ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంగాల స్వాతి భగ వాన్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ అంకుస్ , వీర్ల వెంకటరమణ ,ఆత్మకూరు టౌన్ అధ్యక్షుడు పాపని రవీందర్, తదితరులు పాల్గొన్నారు.