Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పేద రెడ్ల అభ్యున్నతికి కృషి’

జై భారత్ వాయిస్ దామెర, సెప్టెంబరు 12: దామెర మండల కేంద్రం లోని ఏఎన్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన దామెర మండల రెడ్ల విస్తృత స్థాయి సమా వేశంలో రెడ్డి సంఘం దామెర మండల కమిటీ ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి సమక్షంలో కమిటీని నియామకం చేశారు. రెడ్డి సంఘం దామెర మండల కమిటీ అధ్యక్షుడిగా కేతి పెల్లి శ్రీధర్ రెడ్డి (ఓగులాపూర్ ప్రధాన కార్యదర్శిగా కొండి మాధవరెడ్డి(కోగిల్వాయి), ఉపాధ్యక్షులుగా ఆవాల రవీందర్ రెడ్డి (దుర్గంపేట), దామసాని ప్రవీణ్ రెడ్డి(ఊరుగొండ), కూనాటి సునీల్ రెడ్డి (ఊరుగొండ), సంయుక్త కార్యదర్శులుగా ఎస్ రెడ్డి నర్సింహారెడ్డి, గంకిడి రవీందర్ రెడ్డి, కోశాధికారిగా గంకిడి బుచ్చిరెడ్డి(దమ్మన్న పేట)లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షుడు అర్జుల కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో వెనకబడిన పేద రెడ్ల సంక్షేమం కోసం కృషి చేయ నున్నట్లు తెలిపారు. అలాగే పేద రెడ్ల సమస్యల పరిష్కారం కోసం తన వంతు పాత్ర పోషించనున్నట్లు హామీనిచ్చారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు రావుల నర్సింహారెడ్డి, పోలం కృపాకర్ రెడ్డి, జిల్లా నాయకులు వీసం రమణారెడ్డి, మన్నెం ఇంద్రారెడ్డి, గొంది జగన్మోహ రెడ్డి రెడ్డి సోదరులు పాల్గొన్నారు.

Related posts

అత్మకూరు పాఠశాల ను ఆకస్మికంగాచేసిన కలెక్టర్ ప్రావీణ్య.-పరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవ వినాశనానికి ఉపయోగిస్తున్నారు!