జై భారత్ వాయిస్ గీసుకొండ
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్స్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరగొని నిర్మలదేవి డిమాండ్ చేశారు. గీసుకొండ మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరగొని నిర్మలదేవి మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. వేతనాల పెంపు, ఇతర సమస్యల పైన ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు
అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి. కనీస వేతనం . 26,000/ రూపాయలు ఇవ్వాలని,పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ. 10 లక్షలు, హెల్పర్లకు రూ. 5 లక్షలు చెల్లించాలి. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలిని అన్నారు.ఈ సమ్మెలో అంగన్వాడి టీచర్స్ భారతి , జయసుధ, ఎన్. నిర్మల,కే నిర్మల,జి.ఆరుణ అనిత, అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు