Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు పంచాయతీకి స్వచ్చ రాష్ట్ర స్థాయి అవార్డు

ఆత్మకూర్ పంచాయతీకికి
రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు ప్రధానం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);

స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ -2023 అవార్డులలో భాగంగా ఐదు వేలకు జనాభా కల్గిన గ్రామ పంచాయితీ ల్లో మొదటి ర్యాంకు తో ఆత్మకూరు గ్రామ పంచాయితీ కి పురస్కారాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజుకు రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హైదరాబాద్ లో అందచేశారు. రాజేంద్రనగర్ లోని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం లో గురువారం స్వచ్ఛ పురస్కారాల ప్రధానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస కుమార్, డీపీఓ వి జగదీశ్వర్, ఎంపీడీఓ ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సి చేతన్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడ యాదగిరి, ఎస్బియమ్ కన్సల్టెంట్లు ప్రవీణ్, సంపత్ పాల్గొన్నారు.

“పరిశుభ్రతతో పాటు అభివృద్ధి పనులు దోహదం చేసాయి”

ఆత్మకూర్ గ్రామంలో నిత్యం జరుగుతున్న ఒడిఎఫ్ ప్లస్ కార్యక్రమాలు అయిన ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణతో పాటు, తడి,పొడి చెత్త నిర్వహణ , అంశాలతో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి రూ.3 కోట్ల 50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా అవార్డు రావడానికి దోహదం చేశాయని ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ చేతన్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. ఇటీవల పెద్ద చెఱువు నుండి
రాయకుంట చెరువు వరకు రూ. 1 కోటి 80 లక్షల రూపాయల తో సీసీ డ్రైనేజీ నిర్మాణం వలన గ్రామం సుందరంగా తయారైంది అన్నారు. అలాగే 1కోటి 70 లక్షల రూపాయలతో గ్రామంలో 11 బిట్లతో చేపట్టిన సీసీ రోడ్లతో మట్టి రోడ్లు అనేది లేకుండా గ్రామంలో దాదాపు తొంభై శాతం సీసీ రోడ్లు కవర్ అయ్యాయని వివరించారు. దీని వల్ల ఆత్మకూర్ గ్రామం సీసీ రోడ్ల తో, సెంట్రల్ లైటింగ్ తో సుందరంగా కనిపిస్తోంది అన్నారు. స్వచ్ఛ పురస్కారాల పోటీకి ఆత్మకూర్ గ్రామాన్ని అధికారులు ఎంపిక చేయడానికి మల్టి పర్పస్ వర్కర్లు నిత్యం చేస్తున్న పారిశుద్ధ్య పనులు ఒకవైపు, గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు కారణం అయ్యాయని ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ చేతన్ రెడ్డి తెలిపారు.

Related posts

ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల!

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయచందర్ రెడ్డి

Jaibharath News

శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు

Jaibharath News