ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకులు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగ రాజయ్య,మందపెల్లి సంజీవ గులాబీ గూటికి చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, కాంగ్రెస్,బిజెపి లాగా ఢిల్లీలో హైకమాండ్స్ ఉండవని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారనీ అన్నారు.బీఆర్‌ఎస్‌పై అసంబద్ధమైన గోబెల్స్ ప్ర చారం చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరే లలిత రమేష్,గ్రామ శాఖ అధ్యక్షులు ,జిల్లపెల్లి సుధాకర్,వార్డు మెంబెర్ లకుం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.