Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సర్పంచ్ ను అభినందించిన హన్మకొండ కలెక్టర్

నీవు పడ్డ కష్టానికి.. ప్రతి ఫలితం ఈ అవార్డులు
– ఈ సన్మానం మాకు కాదు మేమే మీకు చేయాలి
– జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
– సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించారు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

తెలంగాణ రాష్ట్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో ఎంతో శ్రమపడి చేసిన అభివృద్ధి పనులకే ప్రభుత్వం గుర్తించి మీకు ఈ అవార్డులు అందించిందని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు ను అభినందించారు. శనివారం ఆత్మకూర్ సర్పంచ్ పర్వతగిరి రాజు,డిఆర్డిఓ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి,ఎంపీ ఓ చేతన్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ సన్మానం నాకు వద్దు మేజర్ గ్రామపంచాయతీ అయినా ఆత్మకూరును రాష్ట్రానికి ఆదర్శంగా అభివృద్ధి చేసినందుకు మేమే ఆత్మకూరు కు వచ్చి నిన్ను సన్మానం చేయాలి అని జిల్లా కలెక్టర్ అభినందించారు. శాలువతో సర్పంచ్ పర్వతగిరి రాజు కు సన్మానం చేసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. మీ గ్రామ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కలెక్టర్ భరోసానిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు చేసి మరిన్ని ఉత్తమ అవార్డులు పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సర్పంచులకే ఆదర్శంగా నీవు నిల్చావని ప్రశంసలు కురిపించారు. అందరూ నీలాగా ఉంటే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని జిల్లా కలెక్టర్ కొనియాడారు.
కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీఓ రాజిరెడ్డి, వార్డు సభ్యులు రేవూరి జయశ్రీ జయపాల్ రెడ్డి, కాడబోయిన రవియాదవ్ , డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ సంపత్,ప్రవీణ్,ఈసీ రాము, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అట్టహాసంగా ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం

ముస్త్యాలపల్లిలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు.