Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆరోగ్యానికి చిరు ధాన్యాల ఆహారం ఎంతో మేలు

భారత్ వాయిస్ దామెర
ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి చిరు ధాన్యాలతో కూడిన ఆహారం ఎంతో మేలు చేస్తుందని ఎంపీపీ కాగితాల శంకర్ తెలిపారు. శనివారం దామెర మండలం వెంకటాపూర్, సింగరాజుపల్లి గ్రామాల్లో ఐసీడీఎస్ పరకాల ప్రాజెక్ట్ అధ్వర్యంలో పోషణ మాసం సంబురాలను నిర్వహించారు. జాతీయ పోషణ మాసం పురస్కరించుకుని ఐసీడీఎస్ దామెర సెక్టార్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా ఎంపీపీ శంకర్ హాజరయ్యారు. ఇందులో వెంకటాపూర్ సర్పంచ్ పున్నం రజితనం పత్ సౌజన్యంతో వెంకటాపూర్, సింగారజుపల్లి, కోగిల్వాయిలోని 12 మంది గర్భిణులకు సామూహిక సీమంతం జరిపించారు. అనంతరం ఎంపీపీ శంకర్ మాట్లాడుతూ పరకాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబంగా కోరుతూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెం కటాపూర్ సర్పంచ్ పున్నం రజితసంపత్, సీడీపీవో భాగ్యలక్ష్మీ, ఊరుగొండ, దామెర సెక్టార్ సూపర్వైజర్లు టి.పద్మావతి, జె. రాణి. జీపీ సెక్రటరీ సందీప్, జిల్లా ఉమెన్ హబ్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ కల్యాణి, స్వర్ణలత, బిక్షపతి, ఏఎన్ఎం స్వరూప, సింగరాజుపల్లి వెం కటాపూర్ అంగన్వాడీ టీచర్లు రాజసులోచన, వాణి, శోభ, కోమల, జ్యోతి, ఫాతిమా, పుష్ప, వనజ, ఉదయ, రమ, సంధ్య, సరళగౌరి, ఆశా కార్యకర్తలు రమాదేవి, శకుంతల, హెలర్స్ లావణ్య, రాంబాయి, తల్లులు, తదితరులు పెద సంఖ్యలో హాజరయ్యారు

Related posts

వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

ఎమ్మేల్యే, సి ఎం లకు పాలాభిషేకం

Jaibharath News