Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహములు పంపిణి

జై భారత్ వాయిస్ వరంగల్
పర్యావరణ పరిరక్షణ కొరకు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయక మట్టి విగ్రహములకు పూజలు జరపాలని లయన్స్ క్లబ్ హనుమకొండ ఆత్మీయ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా కోరారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని 42వ డివిజన్ లో . వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి విగ్రహాలను ఉచితంగా భక్తులకు లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వరి, కార్పొరేటర్ చందనా పూర్ణచందర్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనక వస్తువులతో తయారుచేసిన వినాయక విగ్రహంలు నిమజ్జనం చెరువులో వేయడం వలన నీరుఅంతయు కలుషితమై ప్రజలకు జలచర జీవరాసులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మండపాలలో ఇండ్లలో పెట్టి పూజ నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో శివశ్రీ ఆసుపత్రి సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు

Related posts

రతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’

Jaibharath News