జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడుశివారు 163 జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.
ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గూడెప్పా డు గ్రామానికి చెందిన మేక స్వామి రెడ్డి(70) వ్యవసాయ పనుల నిమిత్తం సైకిల్ పైన వ్యవసాయ బావి వద్దకు వెళుతుండగా గూడే ప్పాడు గ్రామ శివారులోని రోడ్డు క్రాస్ చేస్తుండగా ములుగు నుండి హనుమకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి స్వామి సైకిల్ ను ఢీకొట్టగా తీవ్ర గాయాలైన స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునిభార్య సరోజినమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
previous post
next post