January 11, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం

కుటుంబ భరోసా స్కీమ్ ద్వారా 155000అందించిన ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం.
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నీరుకుళ్ళ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ పుచ్చరాజు కుటుంబానికి కుటుంబ భరోసా స్కీమ్ ద్వారా 155000 వేల ఆర్థిక సహాయాన్ని రాజు తల్లిదండ్రులకు అసోసియేషన్ మండల అధ్యక్షులు వెలీదే లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి కక్కెర్ల కమలహాసన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గాదె లింగమూర్తి అందజేశారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ పుచ్చరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు రాజు కుటుంబానికి చేయూత నందించేందుకు ముందుకొచ్చారు. రాజు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు వృత్తిలో భాగంగా మాలో ఒకని గా ఇంతకాలం కలిసి మెలిసి ఉన్న రాజు జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా కార్యదర్శి పి దయాకర్, సత్యనారాయణ కందికొండ శ్యామ్, బిళ్ళ రమేష్ అసోసియేషన్ సభ్యులు ఓదెల సదానందం, ఉప్పునుతల కోటి శ్రీను,పైడి, తదితరులు పాల్గొన్నారు

Related posts

కాలనీ అభివృద్ధికి  కృషి చేస్తా ఎమ్మెల్యే  రాజేందర్ రెడ్డి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి – సీ ఐ క్రాంతి కుమార్

Ashok

మాటల ప్రభుత్వం కాదు – చేతల ప్రభుత్వం

Sambasivarao
Notifications preferences