గీసుగొండ; రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 23వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బుధవారం దీక్షా శిబిరం హన్మకొండ ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ హనుమకొండ రెండు జిల్లాలకు సంబంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు ర్యాలీ గా వెళ్లి శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. వారి యొక్క ఉద్యోగాలని క్రమబద్ధీకరించే విదంగా ముఖ్యమంత్రి మనసు మార్చాలని అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ అమ్మవారు కరుణించి ఉద్యోగాలను క్రమబద్ధీకరించే విధంగా కేసీఆర్ మనసు మార్చాలని అమ్మవారిని వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు

previous post