జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలో “గీతాలక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం” సభ్యుల పర్సనల్ పాస్ బుక్స్ ను పరపతి సంఘం గౌరవ సలహాదారులు ఐకెపి సిసిలు కోల శోభ, కక్కెర్ల సుజాత ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాన ఉపాధ్యాయులు కర్ణకంటి రామ్మూర్తి మాట్లాడుతూ నేటి చిన్న మొత్తాల పొదుపు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు గీతాలక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం” రెండు సంవత్సరాలను పూర్తిచేసుకుని మూడవ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా సభ్యురాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు పరపతి సంఘానికి అన్ని రకాల సలహాలు సూచనలు, గ్రామానికి చేస్తున్న సేవలు ఆర్థిక సాయం చేస్తున్న గీతా లక్ష్మీనారాయణ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు

previous post