(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండలంలోని పద్మశాలి మండల అధ్యక్షుడు వెల్దె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాబుకి ఆశయాలను కొనసాగించాలని వారు చేసిన నిస్వార్ధ సేవను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందుండి తెలంగాణ ప్రజలను నడిపించారని వారు కలలుగన్న తెలంగాణను భావితరాలను గుర్తించుకొని ముందుకు నడిపించాలని కోరారు. పద్మశాలి లు రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి న్యాతని ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు పాపని రవీందర్, చిమ్మని దేవరాజ్, బలబద్ర కిషోర్, మండల కోశాధికారి వడ్డేపల్లి ప్రసాద్, ఆత్మకూరు గ్రామ పద్మశాలి అధ్యక్షుడు వడ్డేపల్లి వేణు, కోశాధికారి జాగిలపు శ్రవణ్ కుమార్, యూత్ కోశాధికారి అల్వాల రవి, కపిల్, వడ్డేపల్లి కోటయ్య, వెల్దే సదానందం, కోటయ్య, మండల పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు.
previous post
next post