*తిరుమలగిరిలో మహా అన్నదానం..*
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో గణపతి భక్త మండలి వారి ఆధ్వర్యంలో బొడ్రాయి సమీపంలో ఏర్పాటుచేసిన గణపతి మండపం వద్ద మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం జరిగింది.ఈ కార్యక్రమంలో బూర రమేష్,దూడం రమేష్,బూర వెంకటేశ్వర్లు,రామకృష్ణ,బాలకృష్ణ,బూర హరి కృష్ణ శివకృష్ణ,చిరంజీవి,సాంబయ్య,గడ్డి వెంకటేష్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.