Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బాధితుడికి మొబైల్ ఫోన్ ను అప్పగించిన పోలీసులు


జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల అకాష్ తన మొబైల్ ఫోన్ ను ఆగస్టు 25న జాతీయ రహదారి-163 లోని ఔటర్ రింగ్ రోడ్ వంగపహాడ్ క్రాస్ రోడ్ సమీపంలో పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధితుడు ఆకాష్ దామెర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  బాధితుడి పిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  మొబైల్ ఫోన్ కైకలూరుకు చెందిన ఓ లారీ డ్రైవర్ వద్ద ఉన్నట్లు విచారణలో తెలిసింది., శుక్రవారం దామెర క్రాస్ రోడ్ లోని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్ సమీపంలో ఆ లారీ డ్రైవర్ నుంచి మొబైల్ ఫోన్ ను దామెర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం బాధితుడు ఆకాష్ ను దామెర పోలీస్ స్టేషన్ కు పిలిపించి, సామ్సంగ్ ఎం-12 మాడల్ మొబైల్ ఫోన్ ను అప్పగించారు. దీంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Related posts

Chaitanya digree college technovista చైతన్య డిగ్రీ కాలేజీలో టెక్నో విస్టా

కొత్తకొండ వీరభద్రస్వామి అమ్మవారిని దర్శించుకున్న ముల్కనూరు సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు కుటుంబ సభ్యులు

Jaibharath News

ఫ్లాష్… ప్లాష్…వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్ స్పెక్టర్ల బదిలీలు

Jaibharath News