జై భారత్ వాయిస్ గీసుకొండ)
మన ఓటు మనం వేసుకుంటే మన కులపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని యస్ యస్ గార్డెన్ లో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ముఖ్యఅతిథిగా పరకాల మాజీ ఎమ్మెల్యే ,మున్నూరు కాపు ముద్దుబిడ్డ మొలుగూరి బిక్షపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో మన మున్నూరు కాపు బిడ్డ ఎమ్మెల్యేగా గెలిస్తే మనందరికీ ఆత్మ గౌరవంగా ఉంటుందని అన్నారు. మనందరం ప్రతిరోజు గంట ,రెండు గంటలు సమయం కేటాయిస్తే రాబోయే ఎన్నికలలో మనదే విజయం అవుతుందని అన్నారు. మన కులంతో ప్రతి ఒక్క కులానికి గౌడ, కుమ్మరి, కమ్మరి, పద్మశాలి , దళిత కులాలతో సత్సంబంధాలు ఉంటాయని వారందరితో మన కులపు బిడ్డకు ఓటు వేయించాలని కోరారు.తక్కువ ఓటర్ శాతం ఉన్న అగ్రవర్ణాలు ఐకమత్యంగా ఉండి విజయం సాధిస్తున్నారని దానిని గుర్తు పెట్టుకొని ఈసారి నియోజకవర్గంలో మెజార్టీ ఉన్న మనందరం కలిసి మన కుల బిడ్డను గెలిపించుకోవాలని అన్నారు.
పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరం ఐకమత్యంతో ఉండి మన కుల సంఘాన్ని బలోపేతం చేస్తూ అందరం కలిసికట్టుగా ఉంటే మనకు తిరుగులేదని అన్నారు.మన ఆడబిడ్డలు, తల్లులు వ్యవసాయ పనులకు పోయిన దగ్గర, పెళ్లిళ్లకు పేరంటాలకు పోయిన దగ్గర మన కుల సంఘం వ్యక్తికి ఓటేయాలని కోరాలని తెలిపారు. మన వ్యక్తి ఎమ్మెల్యే అయితే మనందరి సమస్యలు తీరుతాయని అన్నారు . అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీరందరూ మన కుల సంఘం వ్యక్తిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు ముఖ్య నాయకులు తోట తిరుపతయ్య , డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,పూజారి సత్యనారాయణ, గుళ్ళపల్లి వెంకటేశ్వర్లు, గైనేని రాజన్ , వాసం సురేష్, గోదాసి చిన్న , మాడిశెట్టి రవి, కూసం లింగయ్య , భూతం రామయ్య , పిట్ట విరస్వామి, పెరికారి హేమలత , కొంరయ్య, రుద్రప్రసాద్ కాశెట్టి కుమార్, గజ్జి రవి, నిమ్మకాయల నిర్మల , గీసుగొండ మండలం మున్నూరు కాపు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.