Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం

కాంగ్రెస్‌ నాయకుల మోసపు మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని,
నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్.ప్రభుత్వం నిలిచిందని పరకాల పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం ఉదయం గీసుగొండ మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇండ్ల స్థలాల మంజూరు పత్రాలు వారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు ఏనాడూ తెలంగాణ ప్రాంతాన్ని,ప్రజలను పట్టించుకోలేదు.ఏండ్లకేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎడారి అవుతుందని ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు అన్నారని తెలిపారు.నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది.దేశానికే దిక్సూచిగా రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని చెప్పారు.నేడు కనీవినీ ఎరగని రీతిలో ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తున్న ఘనత కేసీఆర్ దని ఇక్కడ గ్యారెంట్‌ స్కీంలు అని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు తెలియజేయాలని సవాల్‌ విసిరారు.వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం బీఆర్‌ఎస్‌కే, అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్‌ నమోదు చేస్తారని స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు.గతంలో గీసుగొండ మండలం గతంలో ఎలావుంది,ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలు గమనించాలిని నేడు గ్రామాలకు,మండలాలకు అనుసంధానంగా ఉండే రహదారులు వేసుకున్నాంమని చెప్చారు.పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్ని అభివృద్ధి చేసుకున్నామని .కాంగ్రెస్ పాలనలో వలసలు వెళ్లిన మన ప్రాంత వాసులు వాపసు రప్పించిన ఘనత కేసీఆర్ దే నని తెలిపారు.ఈ కార్యక్రమంలో. గీసుకొండ జడ్పిటిసి పోలీస్ ధర్మారావు, చంద్రాయపల్లె గ్రామ సర్పంచ్ స్రవంతి రుద్ర ప్రసాద్, ఎంపీటీసీ శ్రావ్య భరత్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీరగొని రాజ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు,బి.ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

Jaibharath News

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

బిజెపి ఎంపి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం