జై భారత్ వాయిస్ దామెర
దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ,ఎంపి పసునూరి దయాకర్ అన్నారు.ఆదివారం దామెర మండలంలోని ఏ.ఎన్.ఆర్. గార్డెన్స్ లో నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడతూ..దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి దళిత బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలు కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు.ఎన్నో నైపుణ్యాలు వారిలో ఉన్న ఆర్థిక సమస్యలతో ముందుకురాలేని వారికి దళితబందు పథకం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యేలా యూనిట్లను ఎంచులుకోవాలని సూచించారు.మనం ఎంచుకున్న యూనిట్ ద్వారా మన కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా ఉండాలని సూచించారు.
దళిత పథకం రాని వారెవ్వరూ నిరాశ పడవద్దని,విడతల వారీగా అందరికీ అందజేయడం జరుగుతుందన్నారు.దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని తెలిపారు.గతంలో నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంచుకొని వారికి అండగా నిలవడం జరిగిందని తెలిపారు.నేడు అంబేడ్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,దళితబంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

previous post