Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులు పంపిణీ.

జై భారత్ వాయిస్ ఆత్మకూర్
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన 43 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని కోరారు. గ్రామాలలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామికి ఉత్సవమూర్తుల విగ్రహాల ఊరేగింపు రథం బహుకరణ

Sambasivarao

వివాహానికి ఆర్థిక సహాయం

Jaibharath News

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం