జై భారత్ వాయిస్ ఆత్మకూర్
పరకాల నియోజకవర్గం, అత్మకూర్ మండలం పెద్దపూర్,లింగమడుపల్లి గ్రామంలో బిజెపి గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల ఇన్ చార్జీ డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దగా కోరు ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రైతుబంధు పేరు చెప్పి బడాబడా నాయకులకు భూస్వాములకు కోట్లాది రూపాయలను రైతుబంధు పేరుమీద దారి మళ్ళించడం జరుగుతుందని చెప్పారు.
ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పిముఖ్యమంత్రి కేసిఆర్ తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకున్నారని తెలిపారు. దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు కాకుండా బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెసరు విజయచందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుముత్యాల శ్రీనివాస్ గౌడ్ ఆత్మకూర్ బిజెపి మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం
బిజెపిమండలప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి ఆర్టిఐ జిల్లా కన్వీనర్ ఏదులాపురం శ్రవన్ కుమార్ మండల ఉపాధ్యక్షులు గట్టు వేణు జిల్లా కార్యదర్శి మోలుగురి శ్రీనివాస్ గీసుగొండ మండల అధ్యక్షులు నిమ్మగడ్డ జాన్ విక్రమ్ ఓ బి సి మండల అధ్యక్షులు వెళ్తే సదానందం బూత్ అధ్యక్షులు వజ్ర రవికుమార్ కొమ్ముల భద్రయ్య మాదిరెడ్డి సురేందర్ బత్తిని వీరస్వామి వేముల సాయి రెడ్డి లకిడే నాగరాజు కానుగుల రాం మోహన్ కొమ్ముల ప్రవీణ్ పెద్దాపురం,లింగమడుపల్లి గ్రామస్తులు తదితరులు, పాల్గొన్నారు.
previous post
next post