Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

జాతీయ స్థాయికి ఎంపికైన అక్షయ్ కుమార్ కు అభినందన

అక్షయ కుమార్ జాతీయస్థాయికి ఎంపిక కావడం హర్షనీయం

-సెయింట్ థెరిసా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్…

-అక్షయ్ ని సత్కరించిన ఉపాధ్యాయులు…

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో విజేతగా నిలిచిన ఐదవ తరగతి విద్యార్థి సిరిపురం అక్షయ కుమార్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం హర్షనీయమని ఆత్మకూరు సెయింట్ థెరిసా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్ అన్నారు. బుధవారం పాఠశాలలో విద్యార్థి అక్షయ్ కుమార్ ను ప్రిన్సిపాల్ జాయిస్, వైస్ ప్రిన్సిపాల్ రోస్మా, కరస్పాండెంట్ అస్మేరియా, పాఠశాల సిస్టర్స్ ఉపాధ్యాయులు బయ్య రవికుమార్, రాజు ,సంపత్ శ్రీనివాసు, మహేష్ , మహేందర్ లు ఘనంగాసత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులంతా అక్షయ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో పథకాలు సాధించినట్లయితే పుట్టిన గ్రామానికి ,తల్లిదండ్రులకు, పాఠశాలకు, రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చిన వారవుతారని పేర్కొన్నారు. అక్షయ్ ను క్రీడల ల లో తీర్చి దిద్దిన పీ ఈ టి లు అర్షం మహేందర్, శ్రీకాంత్ లను ప్రిన్సిపల్ అభినందించారు.

Related posts

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు డైరీల బహుకరణ

Sambasivarao

అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర వేలం పాటలు

Jaibharath News

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు