యువత ఆటల్లో రాణించాలి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ప్రభుత్వం సరఫరా చేసిన క్రీడా పరికరాలను వినియోగించుకుని గ్రామాల్లో క్రీడ ల్లో రాణించాలని ఆత్మకూరు ఎంపిపి మార్క సుమలత అన్నారు. బుధవారం మండల్ పరిషత్ కార్యాలయంలో కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ ల పంపిణీ జరిగింది. యువత స్మార్ట్ ఫోన్ మాయాజాలం లో పడకుండా ఉదయం, సాయంత్రం ప్రభుత్వ పాఠశాలలో ని క్రీడా ప్రాంగణాల్లో ఆడుకుని నైపుణ్యం సాధించాలని కోరారు. జడ్పీటీసీ కక్కర్ల రాధిక మాట్లాడుతూ యువతీ యువకులు చెడు మార్గం పట్టకుండా ఏదైనా ఆటలో రాణిస్తే బహుమతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఉంటుందన్నారు. ఎంపీఓ చేతన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 15 గ్రామాలకు వాలీబాల్, క్రికెట్, డoబెల్స్ కిట్లను అందచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు వరుణ్, సర్పంచులు యాదగిరి, రాజు, రజియా బేగం రంపిస మనోహర్, పి.ఇ. టి లు గ్రేస్, కిషన్, సూపరింటెండెంట్ పంచాయతీ కార్యదర్శులు వసంతరామ్, మేడ యాదగిరి, రవి,అనూష, కల్యాణి, సునీల్,లావణ్య, పాల్గొన్నారు.