April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కుట్టు మిషన్లను పంపిణీ

జై భారత్ వాయిస్ దామెర
పోచంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న కుట్టుమిషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ల ఫోరం చైర్మన్ గట్ల విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా బుధవారం దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమలంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పోచంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోల్కొండ సాంబయ్య, జీపీ సెక్రటరీ సరళ, కోఅప్షన్ సభ్యుడు అక్తర్, వార్డు సభ్యులు గుండా రజిని. జంగిలి నవ్యశ్రీ, కారోబార్ యజ్ఞం సురేష్, సల్ల అర్జున్, ఏఎన్ఎం స్వరూప, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సి ఎం సహాయ నిధి భరోసా

Jaibharath News

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Jaibharath News

శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల శాంతి ర్యాలీ