(జై భారత్ వాయిస్:భీమదేవరపల్లి)హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామ ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కనుకయ్యకు, రాజ్ మహ్మద్ కు ప్రవీణ్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బొల్లోని పల్లి గ్రామశాఖ అధ్యక్షులు బొల్లి సుమన్, అధ్యక్షులు గోపాల్ రావు, రాంనగర్ గ్రామశాఖ అధ్యక్షులు సయ్యద్ బాషా, కనుకయ్య, కాంతారావు, రాజ్ కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

previous post