( జై భారత్ వాయిస్ వరంగల్ )
గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, ఐటి మరియు పారిశ్రామిక వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పర్యటన సందర్భంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటి పరిధిలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకుగాని ట్రై సిటి పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్, గురువారం వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా 6వతేది ఉదయం 09.00 నుండి రాత్రి 08.00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కోనసాగుతాయని తెలిపారు.
*భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు*
ములుగు,భూపాలపల్లి వైపు నుండి వచ్చు భారీ వాహనములు హైదరాబాద్ కు వెళ్ళవలసినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి వెళ్ళవలెను.భూపాలపల్లి పరకాల నుండి ఖమ్మం వెళ్ళవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుండి వెళ్ళవలెను.భూపాలపల్లి పరకాల నుండి వచ్చు భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్ళవలసినవి కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పీరిలు గొర్రెకుంట వెళ్ళవలెను.సిటి లోపలికి వచ్చు భారీ వాహనములు సిటి అవతల ఆపుకోవలెను. మంత్రి పర్యటనలో ఎలాంటి వాహనములు సిటి లోపలికి అనుమతించబడవు.
వరంగల్ నగరంలో తిరుగు అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అన్నారు.ములుగు పరకాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కెయుసి, సి.పి.ఓ. అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్కు చేరుకోవాల్సిఉంటుంది.హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి ములుగు వైపు, కరీంనగర్ వైపు వెళ్ళు బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సి.పి.ఓ ద్వారా కెయుసి, జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్ళు బస్సులు వయా బాలసముద్రం, `అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్ళవలెను.వరంగల్ బస్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుండి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలనివరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.