పేదవారి సొంతింటి కల నెరవేేర్చడానికే గృహలక్ష్మి పథకం.
*ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..*
*గుడెప్పాడ్ -గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
పేదవారి సొంతింటి కల నెరవేేర్చడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఆదివారం ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 22 రెండు పడక గదుల ఇండ్లను ఎమ్మెల్యే ప్రారభించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిస్తున్నదని పేర్కొన్నారు.మన రాష్ట్రంలో సిఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని అన్నారు.గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఈ ఇండ్లకు కూడా త్వరలోనే ఇంటింటికి నల్లా నీళ్ళు అందిస్తామని తెలిపారు.ప్రజలంతా బి.ఆర్.ఎస్.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు గమనించాలనీ చెప్పా రు.గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేనో..బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 9 ఎండ్ల పాలనలో ఎలా ఉందో ప్రజలు గమనించాలని వివరించారు.ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు మాయమాటలు,మోసపూరిత హామీలు నమ్మవద్దని ప్రజలను కోరారు.బి.ఆర్.ఎస్.పార్టీ ఎజెండానే ప్రజల సంక్షేమం అని తెలిపారు. ఎండ్లకేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్,ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ గారిని మూడోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి పెద్దాపూర్ సొసైటీ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి స్థానిక గ్రామ సర్పంచ్ బీరం శ్రీలత,తిరుమలగిరి సర్పంచ్ రంపిస మనోహర్, కటాక్షపూర్ సర్పంచ్ యాదగిరి నీరుకుల్ల సర్పంచ్ ఆర్షం బలరాం, గూడప్పాడు మార్కెట్ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి టిఆర్ఎస్ నాయకులు కక్కర్ల రాజు తో పాటు
ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.