జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
హన్మకొండ జిల్లా ఆత్మకూరు గ్రామంలో గత కొన్ని నెలలుగా కొండెంగ ప్రజలపై దాడి చేయడం తో ప్రజలు భయపడ్డారు. వున్న పళంగా కొండెంగ అకస్మాత్తు గా దాడి చేయడం తో ప్రజలు బయటి కి రావాలంటేనే భయాందోళన లు చెందారు. రోడ్డు పైన వున్న కూరగాయల వంటి చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు. ఎక్కడి నుండి వస్తుందో ఎవరిపై దాడికి దిగుతుందో తెలియని పరిస్థితి నెల కొన్నది. కాగా సోమవారం ఆత్మకూరు గ్రామపంచాయతీ సిబ్బంది కొండెంగను చాకచక్యంగా బంధించారు. ఇది తెలుసుకున్న గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందిని గ్రామంలోని ప్రజలు అభినందించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపామని అన్నారు.
previous post
next post