Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఉద్యోగాలు

డిఎస్సీ పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ

(జై భారత్ వాయిస్ హన్మకొండ)డి.ఎస్సీ, టీచర్ల పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ Dr. M.P.V. Prasad ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు (ఆఫ్‌లైన్) టీ.ఎస్ బీ.సీ. స్టడీ సర్కిల్ హనుమకొండ ఆఫీసు లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులను October 12 తేదీ లోగా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 0870-2571192 ద్వారా సంప్రదించాలని బి.సి. స్టడీ సర్కిల్ డాక్టర్ ఎం.పి.వి. ప్రసాద్ కోరారు.

Related posts

టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల

Jaibharath News

వైద్య కళాశాలల్లో  29మంది   అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

భారతీయ జీవిత భీమా సంస్థ లో LIC jobs 841 ఉద్యొగాలు