హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి, పసరుగొండ గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పసరుగొండలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా కాళీప్రసాద్ రావు చేతుల మీదుగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగుర వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ గడపగడపకు తిరిగారు. ఈ సందర్భంగా కాళీప్రసాద్ రావుతో పాటు బీజేపీ దామెర మండల అధ్య క్షుడు జంగిలి నాగరాజు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంకిడి బుచ్చిరెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గన్ను సతీష్, యువ మోర్చా జిల్లా కోశాధికారి సూర చందర్, దామసాని శ్రీనివాస్ రెడ్డి, గొల్లపెల్లి గిరిధర్, ఎరుకల దివాకర్, అయిత చేరాలు, గోగుల సమ్మిరెడ్డి, మేడిపెల్లి శ్రీనివాస్, పెంచాల జగన్, సుధాకర్, బాబు, కుమార్, శ్రీను, బొచ్చు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

next post