తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డి.ఎస్సీ, టీచర్ల పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు బి.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ Dr. M.P.V. Prasad ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉచిత శిక్షణకు Web site www.tsbcstudycircle.cgg.gov.in ద్వారా లేదా టీ.ఎస్ బీ.సీ. స్టడీ సర్కిల్ హనుమకొండ ఆఫీసు లో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులను October 18తేదీ లోగా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 0870-2571192 ద్వారా సంప్రదించాలని బి.సి. స్టడీ సర్కిల్ డాక్టర్ ఎం.పి.వి. ప్రసాద్ కోరారు.

previous post