Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

గోకుల్ నగర్ లో బతుకమ్మ వేడుకలు

గోకుల్ నగర్ శ్రీ పోచమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లో బతుకమ్మ వేడుకలు

హనుమకొండ గోకుల్ నగర్ పోచమ్మ దేవాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్ బొంగు రాజు పర్యవేక్షణ లో ఏర్పాట్లు చేశారు. ఎంగిలి పుల బతుకమ్మ ఉత్చవాలను గోకుల్ నగర్, అశోక కాలనీ, గాంధీనగర్ ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు లైట్ లను, మైక్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకునే ఎంగిలి బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రజాకార్ల తో పోరాటం చేసిన చరిత్ర కలిగిన బతుకమ్మను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఎంగిలి బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు

Related posts

గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ఎమ్మేల్యే రాజేందర్ రెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది