Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరులో ఘనంగా పెత్ర మాస బతుకమ్మ

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో తొలిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పరిసరాలలో మొదటి రోజు బతుకమ్మను మహిళలు ఆటపాటలతో అంగ రంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో రంగు రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసుకొని మహిళలు ఆలయ పరిసరాలకు తరలివచ్చారు తొలిరోజు పెత్రమాస బతుకమ్మకు మహిళలు ఆటపాటలతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. తొలి రోజు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలతో డీజే పాటలతో హోరెత్తిపోయింది. ఈ బతుకమ్మ పండుగ లో తొలిరోజు పండుగకు ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు సకల ఏర్పాట్లు చేశారు. మహిళలు స్వేచ్ఛగా ఆడుకునేందుకు స్థలాన్ని కేటాయించి ఆటపాటలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది పలు ఏర్పాట్లు చేశారు. మహిళలు దప్పిక తీర్చుకునేందుకు గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఆత్మకూరు, నిరుకుల్ల, పెంచికల పేట, ఆక్కంపేట, పెద్దా పురం, తిరుమలగిరి, కామారమ్, తో పాటు పలు గ్రామాలలో డీజే పాటలతో తొలిరోజు బతుకమ్మ పండుగను ఆనందంగా మహిళలు జరుపుకున్నారు.

Related posts

కోళ్ల ఫారం లు మూసివేయాలి!: జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

Jaibharath News

సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలి