ఆత్మకూరు లో వైభవంగా దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రం లో శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. శైలపుత్ర అవతారంలో అమ్మ వారిని అలంక రించారు. అమ్మవారికి అర్చకులు ఆరుట్ల మాధవ మూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పర్వత గిరి రాజు, భజన మండలి సభ్యులు వాసు, మునుకుంట్ల సతీష్, మాజీ జెడ్పీ టి సి
టింగిలికారి సత్యనారాయణ, పాపని రవీందర్, వికాస తరంగిణి సభ్యులు నాగ బండి శివ ప్రసాద్, సందీప్ తదితరులు భక్తులు పాల్గొన్నారు.
previous post
next post