జై భారత్ దామెర, సంస్కృతీ, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం దామెర మండలం ఊరుగొండలో సర్పంచ్ గోగుల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో ముఖ్య అతిథిగా చల్లా జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఊరుగొండ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. ఈ నేపథ్యంలో మహిళలు ఆలపించిన వివిధ రకాలైన బతుకమ్మ పాటలతో ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోగుల సత్యనారాయ ణరెడ్డి, జడ్పీటీసీ గరిగె కల్పన కృష్ణమూర్తి, సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి ఈశ్వర్, మాజీ సర్పంచ్ జక్కుల రాణీరవీందర్, వైస్ ఎంపీపీ జాకీర్, నాయకులు మల్లాడి రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, గండు రామకృష్ణ, కేతిపెల్లి శ్రీధర్రెడ్డి, కూనాటి సునీల్ రె డ్డి. , జన్ను విద్యాసాగర్,ఊరుగొండలో బతుకమ్మ వేడుకల్లో చల్లా జ్యోతి,
ఇనర్సయ్య, పాండవుల భిక్షపతి, గండు సుదర్శన్, గొల్లపెల్లి కొమురయ్య, పలకల శ్రీనివాస్ రెడ్డి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

previous post