ఆత్మకూరు లో వైభవంగా దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు -స్కందమాత అవతారంలో దేవి
-మహా అన్నప్రసాద వితరణ…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. అందు లో భాగంగా గురువారం భక్తులకు దేవి – స్కందమాత అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులు ఆరుట్ల మాధవమూర్తి ఆచార్యులు మంత్రోచ్ఛారణల మధ్య దేవిమాతకు ప్రముఖ న్యాయవాది టింగిలికారు సత్యనారాయణ దంపతులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి భక్తులు తరలి వచ్చి దర్శించుకున్నారు.సాయంత్రం పూజలు నిర్వహించిన పిమ్మట అన్న ప్రసాద వితరణ జరిగింది. దాదాపు పదిహేను వందల మంది భక్తులు అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భవాని మాత దీక్ష దారులు, భక్తులు పాల్గొన్నారు.