రాబోయే ఎలక్షన్లో అన్ని పార్టీల నాయకులు సమన్వయం పాటించాలి
-పరకాల ఏసిపి కిషోర్ కుమార్…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అన్ని రాజకీయ నాయకులు, ప్రజలు సమన్వయం పాటించాలని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని నీరుకుల్ల గ్రామంలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ కిషోర్ కుమార్, ఆత్మకూరు సిఐ రవిరాజు మాట్లాడారు. గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు మాడల్ కోర్ కండక్ట్ మార్గదర్శకాల ప్రకారం ఏం చేయాలో, ఏమి చేయకూడదో తదితర విషయాలను తెలిపారు. నాయకులు, ప్రజలు శాంతిభద్రతలకు బంగం వాటిల్లకుండా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నీరుకుల్ల పంచాయతీ కార్యదర్శి, ఆయా పార్టీల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.