గ్రామీణ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా
-ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఇటీవల వివిధ కారణాలతో మృతిచెందిన మోడల్ కాలనీ కి చెందిన ఏరుకొండ వెంకటలక్ష్మి, మునిగంటి భాగ్యలక్ష్మి, ఎండీ సాదిక్, బాచి, పానకాని స్వామి, పాయిరాల సమ్మక్క, బయ్య సాంబయ్య కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ టీసీ కక్కర్ల రాధిక రాజు,వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి,మండల శాఖ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమార స్వామి, పెద్దాపురం సొసైటి వైస్ చైర్మన్ అంబటి రాజ స్వామి, మాజీ చైర్మన్ కాంతాల కేశవ రెడ్డి, మాజీ సర్పంచ్ సంపత్ కుమార్, మార్కెట్ డైరేక్టర్ పైడి, పాపని రవీందర్ లతో పాటు
ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.