కార్యకర్తలను కాపాడుకునే వారికే పరకాల కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి
-ఆత్మకూరు వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు వాసు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
పరకాల నియోజకవర్గంలో కార్యకర్తల కాపాడు కునే వారికే పరకాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లి టికెట్ ఇవ్వాలని ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు పరికరాల వాసు అన్నారు. గత 1999 నుంచి కొండా దంపతులు పరకాల నియోజకవర్గ ప్రజలకు ఉండి సేవలు చేశారని అన్నారు. 2014 నుండి ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పరకాల నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు చేసి, పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని చెప్పారు. వీరి ఇద్దరినీ కాదని నర్సంపేట నియోజకవర్గం బిజెపి పార్టీకి చెందిన రేవూరి ప్రకాశ్ రెడ్డి ని ఆగమేఘాలమీద కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని పరకాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించ బోతున్నారని ఆరోపించారు. పరకాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మండల నాయకులు ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దయచేసి పరకాల ప్రజల కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను అర్థం చేసుకొని ఇస్తే ఇనుగాల వెంకట్రాంరెడ్డి గారి కైన, కొండా మురళీధర్ రావు కైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని కోరారు.