మధుర జ్ఞాపకాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
చిన్నప్పటి మధుర జ్ఞాపకాల తో మమేకమై ఆత్మకూరు మండలం నీరు కుల్ల లో పూర్వ విద్యార్ధులు కలిశారు.
2005-2006 టెన్త్ బ్యాచ్ జెడ్ పి ఎస్ ఎస్ నీరుకుళ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నీరుకుళ్లలోని చెన్నకేశవ స్వామి మినీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. 17 సంవత్సరాల క్రితం పాఠశాలలో జరిగినటువంటి సంఘటనలు విద్యార్థిని విద్యార్థులు గుర్తు చేసుకోవడం జరిగింది. అప్పుడు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారితో అప్పటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పటి ఉపాధ్యాయు లు బ్రహ్మయ్య, వెంకన్న, సిద్ది రాజయ్య, వేణుగోపాల్ ,లక్ష్మణ్, పీ ఈ టి బెంజిమెన్ లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు లక్కర్సు రాజు, చందు,రమణాచారి,
ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, బలవంతుల శ్రీకాంత్, శ్యామ్ ,లకుం రజిని, మంగ రజిని, మాధవి, ప్రశాంత్, రమేష్, సంతోష్, మహేందర్, రాజేష్, రజినీకాంత్, వెంకటేష్, మురళి పూర్వ విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.
previous post
next post